పీసీఓడీ మరియు పిసిఒఎస్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
PCOD & PCOS.. చదవడానికి, వినడానికి ఒకేలా ఉన్నా.. ఈ రెండు పదాల మధ్య చాలా తేడా ఉంది. వీటి విషయంలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. పీసీఓడీ అంటే స్త్రీలలోని హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance) గురించి తెలిపేది. ఇక అండాశయాలపై వచ్చే ఆండ్రోజెన్స్ (పురుష హార్మోన్లు) గురించి చెప్పేది పీసీఓఎస్. వీటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
PCODని పాలీసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారు. నెలసరప్పుడు అండం విడుదలైన సమయంలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా పురుష హార్మోన్ల అధిక సంఖ్యలో ఉత్పత్తి అవుతాయి. దీని కారణంగా మహిళలు సంతానలేమికి గురవుతున్నారు. అయితే దీన్ని గుర్తించడం కష్టం. మనదేశంలో PCODతో బాధపడే మహిళల సంఖ్య 10% నుంచి 25% మధ్య ఉందని స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి.
PCOS ని పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటారు. అండాశయాలు సాధారణం కంటే అసాధారణ స్థాయిలో ఆండ్రోజెన్స్(పురుష హార్మోన్లు) ఉత్పత్తి చేస్తే పీసీఓస్‌కి గురి అవుతారు. ఇవి తిత్తులుగా(sacs) మారి అండోత్సర్గము(Ovulation ) సమయంలో అండాలు విడుదల కాకుండా చేస్తాయి. నెలసరి కూడా సమయానికి కాదు. దీనివల్ల గర్భం దాల్చడం కష్టతరం అవుతుంది.
లక్షణాలు: PCOD & PCOS లక్షణాలను గుర్తించడం అంత సులభం కాదు. కానీ, వీటిని త్వరగా గుర్తిస్తే తగిన చర్యలు తీసుకోవచ్చు. నెలసరి సక్రమంగా కాకపోవడం అనేది ఈ రెండింటిలో ప్రధాన లక్షణం. PCOD మరియు PCOS కి గురైన వారిలో ముఖం, శరీరంపై అన్ వాంటెడ్ హెయిర్, మొటిమలు, మూడ్స్‌లో మార్పులు, భారీగా రక్తస్రావం కావడం, బరువు పెరగటం లాంటి లక్షణాలు ఉంటాయి.
కారణాలు:
వంశపారంపర్యం, అధిక బరువు, ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టయిల్ డిసిప్లేన్డ్‌గా లేకపోవడం PCOD మరియు PCOS కి కారణాలు.
దేనికి దారితీస్తాయి?
1. సంతానలేమికి దారి తీస్తుంది. పిల్లలు కలగపోవడానికి ప్రధాన కారణాల్లో ఇది ఒకటి.
2. డయాబెటిస్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.
3. గుండె సంబంధిత వ్యాధులకు గురికావొచ్చు.
4. డిప్రెషన్‌కు లోనవుతారు.
5. ఎండోమెట్రియల్ క్యాన్సర్‌కి కూడా దారి తీయొచ్చు.
బయటపడటం ఎలా?
PCOD మరియు PCOS నుంచి బయటపడటానికి జీవనశైలిలో(Life style) మార్పులు తీసుకురావడంతోనే సాధ్యమవుతుంది. క్రమం తప్పకుండా డాక్టర్ల సూచనలను పాటిస్తూ, సరైన మందులు తీసుకోవడంతో దీనికి దూరం అవ్వొచ్చు.
డైట్ ఫాలో అవ్వండి.!
పీసీఓడీ, పీసీఓస్ సమస్యలతో బాధపడే వారు శరీరంలోని గ్లూకోజ్ స్థాయిల్ని అదుపు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఫైబర్, ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా లభించే గుడ్లు, బాదంపప్పులు, ఓట్స్, పాలు, పాల పదార్థాలు, చికెన్ వంటివాటిని రోజువారీ మెనూలో భాగం చేసుకోవాలి. అలాగే శీతల పానీయాలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే బంగాళాదుంపలు, వైట్ బ్రెడ్ వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి.
ముఖ్యంగా విటమిన్ డీ లోపం లేకుండా జాగ్రత్త పడాలి. ఉదయం, సాయంత్రం పూట ఎండలో నిల్చోవాలి. మాంసం, గుడ్లు, చేపలు వంటి విటమిన్ ‘డి’ అధికంగా లభించే ఆహారం తీసుకోవడం మంచిది. ఒకవేళ మీ శరీరంలో విటమిన్ ‘డి’ స్థాయిలు మరీ తక్కువగా ఉన్నట్లయితే మాత్రం వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్స్ వాడడం మంచిది.
వీటికి కచ్చితంగా దూరంగా ఉండాలి: రీఫైన్డ్ కార్పొహైడ్రేట్స్, షుగర్, సోయా ప్రొడక్ట్స్‌కు కచ్చితంగా దూరంగా ఉండాలి.
వర్కౌట్స్ తప్పనిసరి:
ప్రతి రోజూ వర్కౌట్ చేయడం కూడా చాలా మంచిది. బరువు తగ్గడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. వాకింగ్, కార్డియోతో పాటు కచ్చితంగా యోగా, ధ్యానం చేస్తూ ఉండాలి.
Felicity Fertility సెంటర్స్‌లో మీకు దీనికి తగిన సహాయం అందుతుంది. మరింత సమాచారం, సహాయం కోసం Felicity వైద్యులు డాక్టర్ అఖిలా రెడ్డి గారిని వెంటనే సంప్రదించండి.